Home అంతర్జాతీయ వార్తలు నోబెల్ గ్రహీత నైపాల్ కన్నుమూత

నోబెల్ గ్రహీత నైపాల్ కన్నుమూత

Nobel Prize Winning Author Naipaul Passes Away

లండన్ : నోబెల్ సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత విఎస్ నైపాల్ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లోని తన ఇంట్లో ఆయన కన్నుమూశారు. నైపాల్ భారత సంతతికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత అన్న విషయం తెలిసిందే. ఆయన పూర్తి పేరు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. వెస్టిండిస్‌లోని ట్రినిడాడ్‌లో 1932లో ఆయన జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. ఆంగ్లంలో ఆయన ఎన్నో రచనలు చేశారు. 1971లో బుకర్ ఫ్రైజ్‌ను సాధించారు. 2001లో సాహిత్యంలో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. నైపాల్ మృతితో ఆంగ్ల సాహిత్యంలో తీరని లోటు ఏర్పడిందని ఆయన సన్నిహితుడు మెయిల్ ఎడిటర్ జియెర్డే గ్రెయిగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నైపాల్ మృతిపై పలువురు సాహిత్యవేత్తలు సంతాపం తెలిపారు.

Nobel Prize Winning Author Naipaul Passes Away