Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నోకియా 6.1ప్లస్ స్మార్ట్ ఫోన్ విడుదల…

 Nokia 6.1 Plus Smart Phone Released in Hankang Market

హాంకాంగ్: హాంకాంగ్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోకియా ఎక్స్6 గ్లోబల్ వేరియంట్ ను హెచ్ఎండీ గ్లోబల్  విడుదల చేసింది. అయితే భారత్ లో మాత్రం వినియోగదారులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో కంపెనీ వెల్లడించలేదు. ఆండ్రాయిడ్ వన్ ప్రొగామ్ కింద వస్తున్న ఈ మొబైల్ స్టాక్ ఆండ్రాయిడ్ తో రానుంది. నోకియా 6.1ప్లస్ ధరను 2,228 హాంకాంగ్ డాలర్లుగా నిర్ణియించారు. కాగా భారత కరెన్సీలో ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా  రూ.20,000 ఉండోచ్చు. నీలం, తెలుపు రంగుల్లో ఈ ఫోన్ విడుదల చేశారు. జులై 24 నుంచి హాంకాంగ్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది.

నోకియా 6.1ప్లస్‌ ప్రత్యేకతలు ఇవే..

 5.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే(19:9) విత్‌ 2.5డి గోరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్షన్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌
 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

16+5మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
 16 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా

మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 400 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సామర్థ్యం
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్‌, టైప్‌ సి పోర్ట్‌, క్విక్‌ ఛార్జింగ్‌ 3.0 సదుపాయం

Comments

comments