Home టెక్ ట్రెండ్స్ నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్…

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్…

Nokia-7.1-smartphoneముంబయి: హెచ్ఎండి గ్లోబల్ సంస్థ లండన్ లో రిలీజ్ చేసిన నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ ని తాజాగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. డిసెంబర్ 7నుండి వినియోగదారులకి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.19,999గా నిర్ణయించింది సంస్థ.

అద్భుత బ్యాటరీ బ్యాకప్, డ్యూయల్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే అద్భుతఫీచర్లు ఉన్న ఈ ఫోన్ పై ఎయిర్ టెల్, హెచ్.డి.ఎఫ్.సి సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. హెచ్.డి.ఎఫ్.సి కార్డుతో కొనుగోలు చేసే కస్టమర్లకు 10% క్యాష్ బ్యాక్ ఉండగా… ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.199 రీచార్జీపై 1 టిబి 4జి డేటాని ఇవ్వనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

 

 నోకియా 7.1 ప్రత్యేకతలు:
5.84″  ఫుల్ హెడ్ ప్లస్ డిస్ప్లే (1080 x 2280 పిక్సల్స్)

4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్

స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్

12/5 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

3060 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

nokia 7.1 mobile Launched in India