Home టెక్ ట్రెండ్స్ నోకియా 7.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

నోకియా 7.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

 

న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 7.1ను తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గ్లోస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లోస్ స్టీల్ కలర్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.19,999గా నిర్ణయించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.ఈ ఫోన్‌పై ఎయిర్‌ టెల్ తన కస్టమర్లకు 1టిబి ఉచిత డేటాను అందించనుంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఫోన్‌ ను కొనుగోలు చేసేవారికి అదనంగా మరో 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ను ఇవ్వనున్నారు.

ఫీచర్స్: 5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 2244×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్, 400 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఒరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి విఒఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్ సి, 3060 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో లభిస్తాయి.