Home టెక్ ట్రెండ్స్ ‘నోకియా 8.1’ స్మార్ట్‌ఫోన్ విడుదల

‘నోకియా 8.1’ స్మార్ట్‌ఫోన్ విడుదల

 

న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ బుధవారం విడుదల చేసింది.‘నోకియా 8.1’ పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్‌లో తీసుకొచ్చింది. ఈ నెల 21 నుంచి బ్లూ/సిల్వర్, స్టీల్/ఐరన్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.26,999 ధరకు వినియోగదారులకు లభించనుంది.

కాగా ఈ ఫోన్‌కు గాను నోకియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ సైట్‌లలో ఇప్పటికే ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఇక లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను ఈ ఫోన్‌పై అందిస్తున్నారు. ఎయిర్‌టెల్ ఈ ఫోన్‌ను కొన్న తన కస్టమర్లకు 1 టిబి అదనపు డేటాను ఉచితంగా అందిస్తుండగా..హెచ్‌డిఎఫ్‌సి కార్డులతో ఫోన్‌ను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

నోకియా 8.1 ఫీచర్లు:

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే

2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్

400 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

డ్యుయల్ 4జి విఒఎల్‌టిఇ

డ్యుయల్ బ్యాండ్ వైఫై

యూఎస్‌బీ టైప్ సి

3500 ఎంఎహెచ్ బ్యాటరీ

Nokia 8.1 smartphone to launched