Home టెక్ ట్రెండ్స్ 8జిబి ర్యామ్‌తో నోకియా-9

8జిబి ర్యామ్‌తో నోకియా-9

NOKIA-9

న్యూఢిల్లీ : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా 9 మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ కు 8 జిబి ర్యామ్ ఉండబోతుందని సమాచారం. వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు 8 జిబి ర్యామ్ ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా నోకియా 9 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుందని, స్నాప్ డ్రాగన్ 835ఎస్‌ఒసి కలిగి ఉంటుందని సమాచారం. మరో లీకేజీ వివరాల ప్రకారం నోకియా 9 స్మార్ట్ ఫోన్ కు 13ఎంపి డ్యూయల్ కెమెరాలు, 5.3 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డి తెర, 4/6 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయని, బ్యాటరీ 38000 సామర్థం ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంచనా ధరలు కూడా మార్కెట్లో భారీగానే వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ధర రూ.54,100 వరకు ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.