Home తాజా వార్తలు ఐదు కెమెరాలతో నోకియా 9!

ఐదు కెమెరాలతో నోకియా 9!

Nokia 9 Price in India September 2018

న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి నోకియా 9 ఫోన్ కోసం టెక్ ప్రియులు అత్యంత ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో త్వరలో రానున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్ టెక్‌ప్రియుల్లో అంచనాలను పెంచేసింది. గతంలోనూ ఈ ఫోన్ ఫొటోలు లీక్ అయ్యి వైరల్‌గా మారాయి. తాజాగా మళ్లీ ఈ స్మార్ట్‌ఫోన్ ఫొటోలు పలు సోషల్‌మీడియాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోన్‌కు అతిపెద్ద బ్యాటరీతో పాటు ఐదు రేర్ కెమెరా లెన్స్ ఉన్నట్లు సమాచారం. చైనాకు చెందిన ఓ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఫొటోలు దర్శనమిచ్చాయి. నోకియా పవర్‌యూజర్ వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫొటోలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4,150ఎంఎహెచ్ బ్యాటరీ ఉందని, ఈ ఫోన్ నీలం రంగులో ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశముంది.