Home టెక్ ట్రెండ్స్ నోకియా @ 99

నోకియా @ 99

Nokia smartphones available at Rs 99 and no cost EMI

ముంబయి: హెచ్ఎండి గ్లోబల్ సంస్థ తమ వినియోగదారుల కోసం దసరా, దీపాళి పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం 99 రూపాయల డౌన్‌పేమంట్‌లో ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని హెచ్‌ఎండి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. మిగతా మొత్తాన్ని నో-కాస్ట్‌ ఇఎంఐ ఆప్షన్‌లో నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ ఆఫర్‌ 2018 నవంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుందని వివరించింది. హెచ్‌ఎండి గ్లోబల్‌ లైనప్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 సిరాకో పై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుదారులకు 15 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ కార్పొరేట్‌, బిజినెస్‌, కమర్షియల్‌ క్రెడిట్‌ కార్డులకు వర్తించదు. అలాగే  ఈ ఆఫర్‌లోనే హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుంది.

నోకాస్ట్‌ ఈఎంఐలో రూ.99కే అందుబాటులో ఉన్న ఫోన్లు…
నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో, నోకియా 3.1ప్లస్‌ ఉన్నాయి.