Home టెక్ ట్రెండ్స్ విడుదలైన నోకియా ఎక్స్‌5 స్మార్ట్‌ఫోన్‌….

విడుదలైన నోకియా ఎక్స్‌5 స్మార్ట్‌ఫోన్‌….

noka

ముంబయి: హెచ్‌ఎండి గ్లోబల్‌ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ నోకియా ఎక్స్‌5 ను బుధవారం రిలీజ్ చేసింది. బ్లాక్, వైట్‌, బ్లూ కలర్లలో 3/4 జిబి ర్యామ్‌ వేరియెంట్లలో ఈ ఫోన్‌ లభిస్తుంది. రూ.10,200, రూ.14,300 ధరలకు ఈ రెండు వేరియెంట్లు  వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5.86 ఇంచుల భారీ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ను ఇందులో అమర్చారు. ఫోన్‌ వెనుక భాగంలో 13, 5 మెగాపిక్సల్‌ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేయడం విశేషం. వీటితో పవర్‌ ఫుల్‌ క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలను తీయవచ్చును, ఈ ఫోన్‌ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

నోకియా ఎక్స్‌5 అద్భుత ఫీచర్లు…
5.86 ఇంచ్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే, 720 × 1520 పిక్సల్స్ స్క్రీన్‌ రిజల్యూషన్‌
ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3/4 జిబి ర్యామ్‌, 32/64 జిబి స్టోరేజ్‌, 256 జిబి ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 13, 5 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు
8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జి వివొఎల్‌టిఇ,
డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 4.2, యుఎస్‌బి టైప్‌ సి, 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ.