Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

మార్చి నుంచి  నిరంతర విద్యుత్

 మూడేళ్ల తర్వాత రైతాంగానికి కూడా..
 మిషన్ కాకతీయతో చెరువులన్నింటికీ జలకళ
 రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్
 కరెంటు సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి రూ.27వేల కోట్లు తీసుకొచ్చాం
 ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్

Untitled-2కరీంనగర్: వచ్చే మార్చి నుంచి గ్రామాలకు నిరంతర విద్యుత్, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్‌ను అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆ యన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకు స్థాపనకు హాజరయ్యారు. ఇందులో భాగంగా కరీం నగర్ మండలం ఆసిఫ్‌నగర్ నుంచి ఖాజీపూర్ వర కు రూ.3 కోట్ల నిధులతో, ఎలగందుల నుంచి అసి ఫ్‌నగర్ వరకు రూ. 3 కోట్ల నిధులతో రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వచ్చే మూడేళ్లలో రైతాంగానికి కూడా నిరం తర విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. సమైక్య రా ష్ట్రంలో చెరువులు మరమ్మతులకు నోచుకోక కనుమ రుగయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మిష న్ కాకతీయతో భాగంగా గ్రామాల్లోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కు మార్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో రూ.200 ఉన్న పింఛన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఐదు రేట్లు పెంచి రూ.1000 అందిస్తుందన్నారు. రానున్న రో జుల్లో భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న మహిళలకు, పెళ్లి కాకుండా ఇంటిపై ఉన్న మహిళల కు పింఛన్ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నా రు. కరెంట్ సమస్యలు తీర్చేందుకు కేంద్రం నుంచి రూ.27 వేల కోట్ల నిధులను తీసుకోచ్చామని ఈ సందర్భంగా ఎంపి తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, మత్స శాఖ ఉప సంచాలకులు దేవేందర్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, జడ్‌పిటిసి ఎడ్ల శ్రీనివాస్, సర్పంచ్ దావ వాణి, జిల్లా మత్స సహకార సంఘం అధ్యక్షు డు కోల లక్ష్మణ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
మత్సకారులకు ప్రభుత్వం అండ
ప్రభుత్వం మత్సకారులను అన్నివిధాలా అండగా ఉండి ఆదుకుంటుందని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరా ల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివా రం కళాభారతిలో జరిగిన జిల్లా మత్స సహకార సంఘాల సమాఖ్య సర్వసభ్య సమావేశానికి ఎంఎల్ ఎ గంగుల కమలాకర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్సకారులకు అవసరమైన చేప సీడ్స్‌ను ప్రభుత్వం రూ.200 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంతకుముందు పట్టణంలో రూ.5 కోట్లతో అధునాతన చేపల మార్కెట్‌ను ఏర్పా టు చేశామని తెలిపారు. గ్రామాల్లోని చెరువులు, డ్యాంలో చేపల పెంపకానికి మత్స సహకార సం ఘాలకు హక్కులను కల్పిస్తామని మంత్రి హామీ ఇ చ్చారు. ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ మాట్లాడుతూ మత్సకారులు తమ పిల్లలను చదివించుకోవాలని, సంఘాలు ఆర్థికంగా బలోపేతమ వ్వాలన్నారు. మత్సకారులకు తమ ప్రభుత్వం అన్నివిధాల సహ కారాన్ని అందించి చేపల పెంపకాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, మత్స శాఖ ఉప సంచాలకులు దేవేందర్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, జడ్‌పిటిసి ఎడ్ల శ్రీనివాస్, సర్పంచ్ దావ వాణి, జిల్లా మత్స సహకార సంఘం అధ్య క్షుడు కోల లక్ష్మణ్‌తో పాటు తదితరులు పాల్గొ న్నారు.

Comments

comments