Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఓటేయని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు: సుప్రీం

supreme-courtన్యూఢిల్లీ: ఓటు వేయని వారికి ప్రభుత్వా న్ని ప్రశ్నించే లేక విమర్శించే హక్కు లేద ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యా ప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆక్రమణలను తొలగించాల్సిసిందిగా ఉత్తర్వు జారీచే యాలని, తాను ఎన్నడూ ఓటు వేయ లేదని చెప్పడంతో సుప్రీంకోర్టు బెంచి పై వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ తరపున ధనేష్ ఈష్‌ధన్ కోర్టు కు హాజరయ్యారు. ఆక్రమణలు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, దానిపై ఏక మొత్తం గా కోర్టు ఉత్తర్వును జారీచేయలేదని, ‘ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించడం సబబు కాద ని, ఓటు వేయని వ్యక్తికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదని’ చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృ త్వం లోని బెంచి అభిప్రాయపడింది. న్యాయమూర్తులు ఎన్.వి.రమణ, డి.వై.చంద్రచూడ్ కూడా బెంచి లో ఉన్నారు. ఢిల్లీలో కూర్చుని రాష్ట్రాలలోని ఆక్రమణల గురించి పరిశీలించడం సుప్రీం కోర్టుకు సాధ్యం కాదని, రోడ్లపైన, రోడ్లపక్కనుండే కాలిబాటలపైన ఆక్రమణలు చూసినప్పుడు ఆయా హైకోర్టులకు వెళ్లవలసిందిగా బెంచి పిటిషనర్‌కు తెలిపింది. ఆక్రమణలు తొలగించేందుకు ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా ఒకే ఉత్తర్వు జారీ చేయాలని పిటిషనర్ పట్టుబట్టారు. అప్పుడు బెంచి మీరు ఓటు వేశారా? అని పిటిషనర్‌ను బెంచి ప్రశ్నించింది. ‘నిజాయితితో చెప్తున్నా. జీవితంలో నేనెప్పుడూ ఓటు చేయలేదు’ అని ధనేష్ బదు లివ్వడంతో బెంచి ‘ఓటుచేయని మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే, విమర్శించే హక్కులేదని’ తెలిపింది. కావాలంటే ఆక్రమణలపై హైకోర్టులను ఆశ్రయించాలని సూచించింది.

Comments

comments