Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

అందాలొలకబోసిన నోరా 

Nora Fatehi  special song for Rajkummar  rao

నడుమును వయ్యారంగా ఊపుతూ నాగినిలా నాట్యమాడాలంటే  నోరా ఫతేహి తర్వాతే ఎవరైనా. ‘బాహుబలి’లో ప్రభాస్‌తో ‘మనోహరి…’ పాటలో తన డ్యాన్సుతో అదరగొట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు నోరా మరోసారి తన హుషారైన డ్యాన్సుతో మైరపిస్తోంది. రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో దినేష్ విజాన్, రాజ్-డికె నిర్మిస్తున్న చిత్రం ‘స్త్రీ’. ఇందులో ‘కమారియా…’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో నోరా ఫతేహి అందాలొలకబోస్తూ డ్యాన్సు చేసింది. ఈ సాంగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో నోరా ఫతేహి నాగిని నాట్యంతో ఉర్రూతలూగించింది. ఈ ఐటమ్‌సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇదివరకు ‘దిల్ బార్…’ అనే పాటలోనూ ఇదే రేంజులో చెలగేరిన నోరా మరోసారి తన నాట్యంతో మురిపించింది. ఇక ఆగస్టు 31న ‘స్త్రీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Comments

comments