Home సినిమా హద్దులు దాటిన నోరా

హద్దులు దాటిన నోరా

Nora Pathehi Dance In Sathyameva Jayathe Movie

‘దిల్బర్ దిల్బర్…’  అంటూ సాగే మ్యూజికల్ హిట్ పాట ఒకప్పుడు సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఈ పాట ఇప్పటికీ సంగీతప్రియులను మైమరపిస్తూనే ఉంది. ఇప్పుడు అదే పాటకు అరబిక్ టచ్ ఇచ్చి రీమిక్స్ చేశారు. ఈ పాట ఎలా ఉంటుందో చూడండి అంటూ ఒక టీజర్ కూడా వదిలారు. కానీ దీనిపై వచ్చిన స్పందనను మాత్రం ‘సత్యమేవ జయతే’ ఫిల్మ్‌మేకర్లు అస్సలు ఊహించి ఉండరు. జాన్ అబ్రహం హీరోగా రూపొందుతున్న సినిమా ‘సత్యమేవ జయతే’. దేశం కోసం శ్రమించే ఒక ఆఫీసర్ కథే ఈ చిత్రం. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు. ఇందులో ‘బాహుబలి’ ఫేం నోరా ఫతేహి వయ్యారాలు ఒలకబోస్తూ డ్యాన్స్ చేసింది. అరబిక్ బెల్లీ డ్యాన్స్ స్టయిల్లో అమ్మడు హద్దులు దాటి స్టెప్పులు వేసింది. నడుం తిప్పుతూ ఆమె డ్యాన్స్ చేసింది. కానీ దేశభక్తికి సంబంధించిన సినిమాలో ఈ పాటేంటి నాయనా… అంటూ సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఫిల్మ్‌మేకర్స్‌పై నానా కామెంట్లు చేశారు. ఆ పాట ఎంత బాగున్నా… అందులో నోరా అందాల విందు యూత్‌ను ఆకట్టుకున్నా కూడా పాట మాత్రం సినిమాకు సెట్టయినట్లు అనిపించలేదు. అయితే ఓ మంచి హిట్ కొట్టాలని తహతహలాడుతున్న జాన్ అబ్రహం హీరోగా చేస్తున్న ఈ సినిమాను అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారట.