Search
Tuesday 17 July 2018
  • :
  • :

ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖ ప్రసవాలు

Normal Delivers In Govt Hospital In Siddipet District

సిద్దిపేట రూరల్‌ః గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సుఖ ప్రసవాలు చేయడం జరుగుతుందని మెడికల్ ఆఫీసర్ మోహన్ కృష్ణ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నార్మల్ డెలవరీ చేశారు. అనంతరం తల్లి శిశువుకు కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కెసిఆర్ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నారాయణరావుపేట ఆసుపత్రిలో 12 మందికి కెసిఆర్ కిట్‌ను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టాప్‌నర్సు నిరోష, ఎఎన్‌ఎం ఎల్లమ్మ, సుజాత పార్మసిస్టు ఆనంద్ తదితరులు ఉన్నారు.

Comments

comments