Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఉత్తర కొరియా మరో అణు పరీక్ష

North-Korea

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా మరోసారి అణ్వస్త్ర ప్రయోగం చేసింది. జపాన్, దక్షిణ కొరియా ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించాయి. నార్త్ కొరియా ఆరోసారి అణు పరీక్ష నిర్వహించింది. ఐదో అణు పరీక్ష కంటే ఈ సారి పది రేట్లు ఎక్కువ సామర్థ్యమున్న అణ్వస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో అమెరికా, జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది.  ఆ దేశ చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగినట్లు సమాచారం. ఈ అణ్వాయుధ పరీక్షతో కిమ్‌చెక్ నగరానికి వాయవ్యంగా 75 కిలోమీటర్ల దూరంలో 10 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.

Comments

comments