Home అంతర్జాతీయ వార్తలు 21 ఏళ్ల అమెరికా విద్యార్థికి 15 ఏళ్ల జైలు శిక్ష

21 ఏళ్ల అమెరికా విద్యార్థికి 15 ఏళ్ల జైలు శిక్ష

Frederick-Warmbierప్యోంగ్యాంగ్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి ఫ్రెడరిక్ వాంబైర్‌కు నార్త్ కొరియా 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా శిక్ష కాలంలో 15 ఏళ్లపాటు కారగారంలో ఫ్రెడరిక్ కఠిన శ్రమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లోని ఓ హోటల్‌ ఉన్న రాజకీయ పార్టీకి చెందిన బ్యానర్‌ను ఫ్రెడరిక్ అక్రమంగా తొలగించినందుకు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుతున్న వాంబైర్‌పై విచారణ జరిపిన ఉత్తర కొరియా అధికారులు నేరారోపణ రుజువుకావడంతో అతనిపై ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో తాను చేసిన పొరపాటు పట్ల ఫ్రెడరిక్ ఓ ప్రెస్‌మీట్ ద్వారా క్షమాపణలు కోరాడు. దీనిపై అగ్రారాజ్యం ఎలా స్పందిస్తుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఘటనతో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఇటీవలే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించామంటూ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.