Home అంతర్జాతీయ వార్తలు ద.కొరియాకు ఉ.కొరియా అల్టిమేటం!

ద.కొరియాకు ఉ.కొరియా అల్టిమేటం!

Kim-Jong-Unప్యాంగ్‌యాంగ్ : దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా మరోసారి హెచ్చరికల పర్వం కొనసాగుతుంది. రాజద్రోహం వ్యవహారంలో ద.కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై క్షమాపణలు చెప్పకపోతే.. సియోల్‌లోని అధ్యక్ష భవనంపై దాడి చేస్తామని ఉత్తర కొరియా అల్టిమేటం జారీ చేసింది.

దక్షిణ కొరియా, అమెరికా సైన్యం సంయుక్తంగా విన్యాసాలు 2 నిర్వహిస్తున్నాయి.ఇది తమపై దండయాత్ర చేసేందుకేనని ఉత్తర కొరియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి అమెరికా, ద.కొరియాను ఉద్దేశించి.. సియోల్‌పై దాడి చేస్తామని ఉత్తర కొరియా సైనిక విభాగం హెచ్చరికలు జారీ చేసింది.