Home అంతర్జాతీయ వార్తలు రష్యా చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్

రష్యా చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్

Kim Jong Unమాస్కో: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం మధ్యాహ్నం రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో వ్లాదివోస్తోక్‌లో కిమ్  గురువారం భేటీ అవుతారు. ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య జరిగే చర్చలపై ముందుస్తు ప్రణాళికలు తయారు చేయలేదు.  ప్రత్యేక ట్రైనులో ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి రష్యాకు కిమ్‌ వచ్చారు. ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతం ఖాసన్‌లోని రైల్వే స్టేషన్‌ నుంచి రష్యాలోని వ్లాదివోస్తోక్‌లోకు తొమ్మిది గంటల ప్రయాణ సమయం పడుతోంది. కిమ్ కు  రష్యా అధికారులు తమ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.

North Korea President Kim Arrives to Russia