Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గువామ్‌లో అమెరికాను గురిపెట్టే ఉత్తర కొరియా వ్యూహం

తాజా ప్రకటనలో పోంగ్యాంగ్ వెల్లడి

               Korea

సియోల్: అమెరికాపై ప్రకటనల యుద్ధాన్ని, క్షిపణుల దాడి వ్యూహాన్ని ఉత్తర కొరియా తీవ్రం చేసింది. అధ్యక్షుడు ట్రంప్ కారణంలేని హడావుడి చేస్తున్నారని ఉత్తర కొరియా విమర్శించింది. అమెరికా భూభాగం గువామ్‌ను గురి పెట్టి క్షిపణుల దాడి జరిపే వ్యూహాన్ని ఉత్తర కొరియా అసాధా రణంగా బయటపెట్టింది. అమెరికా అణ్వాయుధ సంపత్తి ఇంతకు ముందు కంటే ఎంతో అధికంగా పెంపొందినట్లు ట్విట్టర్‌లో ట్రంప్ తాజాగా ప్రకటన చేశాక ఈ వ్యూహాన్ని ఉత్తర కొరియా బయటపెట్టింది. అంతకు ముందు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ యున్‌కు అత్యంత గట్టి సందేశాన్ని ట్రంప్ ఇచ్చారు. ప్రపంచం ఇంతకు ముందు ఎన్నడూ చేయనట్లుగా ఉ. కొరియాపై నిప్పులు కక్కుతోందని తన సందేశంలో ఆయన పేర్కొ న్నా రు. కొరియా ద్వీపకల్పాన్ని దాటిపోయే విధంగా కొత్త వినాశానికి ఈ ప్రకటనల యుద్ధం దారితీస్తుందన్న భయాలు సర్వత్రా వ్యాపించాయి.

Comments

comments