Home అంతర్జాతీయ వార్తలు ఒక్క బాంబుతో ఆ నగరాన్ని బూడిద చేస్తాం..

ఒక్క బాంబుతో ఆ నగరాన్ని బూడిద చేస్తాం..

KIM-1ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్‌జాంగ్ మాటల యుద్ధం మొదలుపెట్టాడు. ఓవైపు దేశంలో కరువుతో ప్రజలు కొట్టిమిట్టాడుతుంటే అగ్రరాజ్యాలతో యుద్ధానికి సైయ్యంటున్నాడు. తమ వద్ద నున్న హైడ్రోజన్ బాంబు మాజీ సోవియట్ యూనియన్ అయిన రషా తయారు చేసిన బాంబుకన్నా శక్తివంతమైందని నియంత కిమ్‌జాంగ్ ఉన్ పేర్కొన్నారు. దాన్ని ఖండాంతర క్షిపణి ద్వారా ప్రయోగిస్తే అమెరికా దేశంలోని న్యూయార్క్‌లో గల మాన్‌హట్టన్‌ను పూర్తిగా బూడిద చేయొచ్చని పరోక్షంగా హెచ్చరించారు. అంతటితో ఆగకుండా అమెరికాను తాగే శక్తివంతమైన ఖండాంతర క్షిపణులు తమ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే గత రెండు నెలల క్రితం ఉత్తర కొరియా తన నాలుగో అణు పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో కిమ్‌జాంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం చోటుచేసుకుంది. అయితే మానవత్వాన్ని మంటగొలుపుతున్న కిమ్‌తోపాటు ఆయన సీనియర్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిశీలకులు మార్జుకి దర్సుమేన్ ఐక్యరాజ్య సమితి సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి ఇలాంటి హెచ్చరికలు వెలువడ్డాయి. అయితే సమితి సమావేశంలో పాల్గొన్న ‘డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ బహిష్కరించింది. కాగా, అమెరికా, ఐరోపా దేశాలు మద్దతునిచ్చాయి. ఉత్తరకొరియాకు స్నేహ హస్తాన్ని ఇస్తూవచ్చిన చైనా మాత్రం మానవ హక్కులను రాజకీయం చేయవద్దని అభిప్రాయపడింది.