Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఉ. కొరియా అధ్యక్షుడు కిమ్ చైనా పర్యటన

KIM-IMAGE

న్యూఢిల్లీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆకస్మికంగా చైనాలో పర్యటించారు. ప్రత్యేక రైలులో ఆయన  సోమవారం చైనా రాజధానికి చేరుకున్నట్లు అనధికారిక వర్గాలను ఉటంకిస్తూ  జపాన్‌కు చెందిన క్యోడో న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.  చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునియింగ్ మీడియాతో మాట్లాడుడుతూ కిమ్ చైనాకు రావడంపై  తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. సరైన సమయంలో సమాచారం వెలువడుతుందని ఆమె తెలిపారు. 2011లో తన తండ్రి మరణాంతరం అధికారం చేపట్టిన కిమ్ మొదటిసారిగా చైనాలో పర్యటించినట్లైంది. చైనా, ఉత్తర కొరియా సరిహద్దులతోపాటు గతంలో ఉత్తర కొరియా ప్రముఖులు నివసించిన పలు హోటళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించారు. గతంలో కిమ్స్ తండ్రి కిమ్ జోంగ్ కూడా చైనాను రహస్యంగా సందర్శించారు. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించడం,  ట్రంప్ ఒత్తిడి చేయడంతో  ఆయిల్, బొగ్గు వంటి అత్యవసరాలు నిలిపి వేయడంతో గత కొంత కాలంగా  చైనా, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆంక్షల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కిమ్ తన గొంతును తగ్గించి, అమెరికాతో చర్చలు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

comments