Home తాజా వార్తలు ఉత్తర కొరియా సంచలనం

ఉత్తర కొరియా సంచలనం

North Korean sensation in women's football in Asian Games

మహిళల ఫుట్‌బాల్‌లో 16-0తో తజికిస్థాన్‌పై గెలుపు

పాలెమ్‌బంగ్: ఆసియా క్రీడల మహిళల ఫుట్‌బాల్‌లో డిపిఆర్ కొరియా (నార్త్ కొరియా) సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన మహిళల గ్రూప్‌బి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో నార్త్ కొరి యా 160 గోల్స్ తేడాతో తజికిస్థాన్‌ను చిత్తు చేసింది. మహిళల ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనతను నార్త్ కొరియా జట్టు సొంతం చేసుకుంది. ప్రారం భం నుంచే అసాధారణ ఆట ను కనబరిచిన ఉత్తర కొరి యా గోల్స్ వర్షం కురిపించింది. సంగ్ హ్యాంగ్ సి మ్ ఏకంగా నాలుగు గో ల్స్ చేసింది. ఆట రెం డో, నాలుగో నిమిషం లో సంగ్ కళ్లు చెదిరే గోల్స్ సాధించింది. 24వ, 42వ నిమిషంలో కూడా సంగ్ గోల్స్ నమోదు చేసింది. మరోవైపు కిమ్ యున్ మి, రిమ్‌సె ఒకేలు మూడేసి గోల్స్ చేసి జట్టు ఘన విజయంలో తమవంతు పాత్ర పోషించారు. కిమ్ ఉన్ హవా కూడా రెండు గోల్స్ చేసింది. దీంతో కొరియా 160 తేడాతో తజికిస్థాన్‌పై చారిత్రక విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక పోయింది. కాగా, పురుషుల విభాగంలో మలేసియా 21 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై సంచలన విజయం సాధించింది. మరో పోటీలో ఇరాన్ 30 తేడాతో నార్త్ కొరియాను ఓడించింది. చైనా 70 గోల్స్ తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది.