Home అంతర్జాతీయ వార్తలు మా వద్ద హైడ్రోజన్ బాంబు ఉంది : కిమ్ జోంగ్‌ఉన్

మా వద్ద హైడ్రోజన్ బాంబు ఉంది : కిమ్ జోంగ్‌ఉన్

Kim-Jong-Unప్యాంగ్యాంగ్: అణుబాంబు కంటే మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును తాము రూపొందించినట్లు ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్‌ఉన్ గురువారం తెలిపారు. తన తండ్రి, తాత వేడుకలను జరపడానికి ఫ్యోంగ్‌చోన్ విప్లవ స్థలికి వెళ్ళినప్పుడు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోడానికి అణ్వాయుధంతో పాటు, హైడ్రోజన్ బాంబును ప్రయోగించే స్థాయిలో ఉందని అన్నారు. హైడ్రోజన్ లేక థర్మోన్యూక్లియర్ పరికరం అనేది గొలుసు చర్యల ఏకీకరణతో(ఫ్యుజన్) భారీ పేలుడును సృష్టిస్తుంది. అవి అణు విచ్ఛినం వల్ల రూపొందించినవి. ఉత్తరకొరియా సరికొత్త హైడ్రోజన్ శక్తిని బయటి దేశాలవారు సందేహిస్తున్నారు. కిమ్ వాదనని దక్షిణ కొరియా విమర్శించింది. మేము దీనిని నమ్మలేమని, హైడ్రోజన్ బాంబును రూపొందించే సాంకేతిక నైపుణ్యం ఉత్తరకొరియాకు లేదని దక్షిణకొరియా నిఘా అధికారి  యోన్హాప్ వార్తా సంస్థకు తెలిపారు. ఉత్తరకొరియా అణ్వాయుధ శక్తి విషయంలో అనేక నమ్మశక్యంకాని వాదనలు చేస్తోంది, అమెరికాను కూడా లక్షం చేసుకునే శక్తి ఉన్నట్లు చెప్పుకుంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దానిపై వాణిజ్య, ఆర్థిక, ఆయుధ కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం వారి వద్ద హైడ్రోజన్ బాంబు ఉండే అవకాశం లేదని భావిస్తున్నాను.