Search
Friday 16 November 2018
  • :
  • :

ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్ష

south-koreaసియోల్: ఉత్తరకొరియా తాజాగా మధ్య శ్రేణి క్షిపణిని ఆదివారం ప్రయోగించింది. అణ్వా యుధాలు, క్షిపణుల అభివృద్ధిని వేగవంతం చేయడంలో భాగంగానే ఈ తాజా క్షిపణి పరీ క్షించినట్లు సమాచారం. దక్షిణ ఫ్యోంగన్ ప్రాంతంలోని పుక్‌చంగ్ నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్లు అమెరికా, దక్షిణకొరియాలు తెలిపాయి. ఈ క్షిపణి తూర్పు దిక్కున 500 కిమీ(310 మైళ్లు) ఎత్తుకు ఎగిరిందని దక్షిణ కొరియా సైన్యాధ్యక్షుడు తెలిపారు. ఈసారి ప్రయోగించిన ఈ క్షిపణి సముద్రంలో పడేదాక అమెరికా పసిఫిక్ కమాండ్ గమనిం చింది. ఉత్తరకొరియా వారం కిందట చేసిన పరీక్ష తర్వాత ఇదే తాజా క్షిపణి పరీక్ష. ఇంతకు ముందు ప్రయోగించిన రాకెట్ల కన్నా ఎక్కువ దూరం, ఎక్కువ ఎత్తుకు ఇది ఎగిరిందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాను తాకేలా క్షిపణులను అభివృద్ధిపరిచే దిశలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్‌ఉన్ దశాబ్ద కాలంగా ఈ క్షిపణుల ప్రయో గాలు చేస్తున్నాడు. గత ఏడాదే ఉత్తరకొరియా రెండు అణు పరీక్షలు నిర్వహించింది. బహుశా అది అణ్వస్త్రాలను మెరుగుపరుచుకునే జ్ఞానాన్ని పెంచుకుంటోందనిపిస్తోంది.

ఉత్తరకొరియా చేస్తున్న ప్రయోగాలు దక్షిణ కొరియాకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మూన్ జై-ఇన్‌కు సవాలుగా తయారవుతోంది. ఇదిలా ఉండగా ఉత్తరకొరియా తాజా క్షిపణి పరీక్షపై చర్చించేందుకు మూన్ జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని అధ్యక్ష భవనం బ్లూ హౌజ్‌లో నిర్వహించారు.

North Korea’s latest missile test

Comments

comments