Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మార్కెట్‌కు ఉత్తర కొరియా టెన్షన్

భారీగా నష్టపోయిన సెన్సెక్స్, 

Stock-Marketన్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆందోళనలు సెన్సెక్స్, నిఫ్టీ సూ చీలను ముంచాయి. ఉత్తరకొరియా ఆరో అత్యంత శక్తివంతమైన అణు పరీక్ష నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఈ ప్రభావం ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభా వం చూపగా, అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 189.98 పాయింట్లు నష్టపోయి 31,702.25 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 61.55 పాయింట్లు పతనమై 9,912.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉత్తరకొరియా అణుపరీక్ష నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ప్రతికూల ప రిస్థితులు.. దేశీయ మార్కెట్లనూ నష్టాల వైపు లాగాయి. అదే సమయంలో బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా నష్టాల్లో పయనించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సూచీలు నేలచూపులు చూశాయి. భారీ కంపెనీల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీలీవర్, యాక్సెస్ బ్యాంక్, అదానీ పోరట్స్, టాటామోటార్స్‌లో కౌంటర్లలో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. కేవ లం ఈ షేర్ల అమ్మకాలతోనే సెన్సెక్స్ 200 పాయింట్లు కుంగింది. దీనికి తోడు టెక్నికల్ కారణాల వల్ల కూడా విశ్లేషకులు లాభాల స్వీకరణను సూ చించారు. నిఫ్టీలో కోల్‌ఇండియా, సన్‌ఫార్మా, బాష్ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి షేర్లు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అదానీపోర్ట్, ఎసిసి లిమిటెడ్, టా టామోటర్స్(డి), ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల దిశగా పయనించాయి. ఉత్తర కొరియా మరిన్ని క్షిపణి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోందని దక్షిణ కొరియా చేసిన ప్రకటన మార్కెట్లలో తీ వ్ర భయా న్ని రేపుతోంది. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే పయనించగా, వీటిలో రియల్‌ఎస్టేట్ రంగం షేర్లు  అత్యధికంగా నష్టపోయాయి. జపాన్ ఇండెక్స్ నిక్కీ 0.9 శాతం నష్టపోయింది. దక్షిణ కొరియా ఇండెక్స్ కూడా కోస్పీ 1.1శా తం, హాంగ్‌కాంగ్ మార్కెట్ హ్యాంగ్‌సంగ్ 0.8 శాతం నష్టపోయాయి. చైనా మార్కెట్లు మాత్రం లాభాల్లో ట్రేడయ్యా యి. ఆగస్టులో విదేశీ పెట్టుబడిదారులు అత్యధికంగా రూ.14,293కోట్ల విక్రయాలకు పాల్పడ్డారు.

Comments

comments