Home తాజా వార్తలు గుండెపోటుతో కాదు… ప్రమాదవశాత్తు శ్రీదేవి మృతి?

గుండెపోటుతో కాదు… ప్రమాదవశాత్తు శ్రీదేవి మృతి?

SRIDEVI

దుబాయ్ : నటి శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి చెందిందని దుబాయ్ అధికారులు తమ ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆమె మరణంలో ఎటువంటి కుట్ర లేదని వారు వెల్లడించారు.  దుబాయ్‌లో శనివారం రాత్రి శ్రీదేవి మృతి చెందారు. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దుబాయ్ ఫోరెన్సిక్ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో నీట మునిగి చనిపోయిందని నిర్ధారించారు. ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది. ఆమె పాస్‌పోర్టును రద్దు చేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం వంటి పనులు చకచకా చేస్తున్నారు.

Not a heart attack … Accidental Sridevi died