Home సినిమా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు

పెళ్లి చేసుకునే ఆలోచన లేదు

Sunitha

టాలీవుడ్ టాప్ సింగర్ సునీత గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సునీత పెళ్లి కూతురు కాబోతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై సునీత్ ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లో  స్పందించింది. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఎక్కువ ఆసక్తిని ఎందుకు చూపిస్తారంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను సునీత ఖండించింది. ఆ పుకార్లు అర్థ రహితమని… వాటిని ఎందుకు సృష్టించారో తనకు అర్థం కావడం లేదని మండిపడింది. తాను ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని… ఈ పుకార్లను అడ్డుకట్ట వేసేందుకే ఫేస్‌బుక్ లైవ్‌కు వచ్చానని సునీత క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన పెళ్లి గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని, నెల రోజుల కిత్రమే తన నాయనమ్మ చనిపోయిందని ఆమె పేర్కొంది. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని… భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే స్వయంగా తానే ప్రకటిస్తానని సునీత చెప్పింది.