Home జిల్లాలు మండుటెండలో ఉపాధి

మండుటెండలో ఉపాధి

Not Proper accommodation to upadi hami workers
Not Proper accommodation to upadi hami workers

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ :
ఒకవైపు ఎండలో ఎండుతున్నా పని చేసే చోట సరైన వసతులు కల్పించకపోవడంతో ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు. మండుటెండలో పనులు చేయాల్సి వస్తోంది. ఎండలు మండుతుండడంతో కూలీలు పనులకు సైతం సరి గ్గ హాజరు కాలేకపోతున్నారు. ఉదయం 8గంటలకు భా నుడు నిప్పులు కక్కుతున్నాడు. నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఎండలతో జనం అల్లడుతుంటే మరో పక్క ఉపాధిహామీ పనులను కూలీలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,55,923 జాబ్‌కార్డ్‌లు ఉండ గా ఇందులో 3,24,192 మంది కూలీలుగా నమోదై ఉన్నా రు. కానీ ప్రస్తుతం పనులకు వస్తున్నది కేవలం 80వేల మంది కూలీ లే, కూలీల సంఖ్యను పెంచాలనే ఉద్ధేశ్యంతో అధికారులు మండుటెండల్లోనే కూలీలతో పని చేయిస్తున్నారు. కానీ వారికి సౌకర్యాల కల్పన గురించి అంతగా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఎండకాలంలో ప్రభు త్వం కూలీలకు పని వేళలను మార్పింది ఉదయం 7గంటల నుండి 11 గంటల వరకు పని చేయించాలని అధికారులకు సూచించింది. అయితే ఉదయం 8 గంటల నుండే భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. అలా గే కూలీలు చెరువులో పని చేయడంతో అక్కడ అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేకపోతున్నారు. ఫిల్డ్‌అసిస్టేంట్‌లు ఇచ్చిన కొలతల ప్రకారం గుంతలను తవ్విన తరువాతే ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఎండలోనే పనులు చేయాల్సి వస్తోంది.
* వసతులు అంతంతే
వేసవిలో ఎండలో పని చేసి సేదతీరడానికి కూలీల కోసం ప్రభుత్వం టెంట్లు అందజేసింది. వీటిని గ్రూప్‌కు ఒకరి చొప్పున మేట్లకు అందజేశారు. అయితే కింది స్థాయి సిబ్బంది సమన్వయ లోపంతో టెంట్లు ఎక్కడ కూడా వేయ డం లేదు. మేట్లు, ఫీల్డ్‌అసిస్టేంట్‌లు ఒకరినొకరు పైనే ఆరోపణాలు చేసుకుంటు కూలీలను మధ్యలో బలిపశువులను చేస్తున్నారు. ఎండకాలంలో పని చేస్తున్నా కూలీలకు డీహైడ్రేషన్ గురికాకుండా ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేయాలని నిబంధన ఉంది. అయితే అధికారులు మాత్రం అంగన్‌వాడీ, గ్రామపంచాయతీలలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఎండ నుండి రక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఇప్పటి వరకు జిల్లాలో గ్రామ అధికారులు అవగాహన కల్పించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
* టెంట్లు వేయకుంటే అధికారులను తొలగిస్తాం : పిడి వెంకటేశ్వర్లు
ఎండాకాలంలో పని చేసిన కూలీలు విశ్రాంతి, భోజనం చేసే సమయంలో నీడసౌకర్యం కోసం మేట్లు, ఫీల్డ్‌అసిస్టేంట్‌లు టెంట్లు వేయాలని లేని పక్షంలో వారిని తొలగిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే అన్ని మండలాలకు టెంట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.