Home తాజా వార్తలు రాజ్యసభ ఎన్నికల్లో నోటా చెల్లదు

రాజ్యసభ ఎన్నికల్లో నోటా చెల్లదు

Delhi : Nota is not Valid in Rajya Sabha Elections

ఢిల్లీ : రాజ్య సభ ఎన్నికల్లో నోటా చెల్లదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికలకు నోటా ఆప్షన్ వర్తించబోదని పేర్కొంది. ఈ అంశంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ధర్మాసనం పక్కనబెట్టింది. నోటా ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే వర్తిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌కు ఇసి అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్ విప్ శైలేష్ మనుభాయ్ పార్మర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Nota is not Valid in Rajya Sabha Elections