Search
Saturday 17 November 2018
  • :
  • :

ట్రాన్స్‌కోలో 106 కొలువులు

Notification for 106 jobs vacant in the Southern and Northern Circles

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ సంస్థ పరిధిలోని దక్షిణ, ఉత్తర సర్కిళ్ళలో ఖాళీగా ఉన్న 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూనియర్ పర్సనల్ ఆఫీసర్62 పోస్టులు, జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్44 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తుకు రూ.100, పరీక్షకు రూ.120ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సి/ఎస్‌టి/బిసి వర్గాలు, దివ్యాంగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపునిచ్చారు. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు వ్రాత పరీక్షలో 100 మార్కులు ఉంటాయి. ‘సెక్షన్‌ఎ’ లో 60 మార్కులకుగాను హెచ్‌ఆర్‌ఎం, ఇండస్ట్రియల్ లా, జనరల్, లేబర్ లా తదితర అంశాలు ఉంటాయి.

‘సెక్షన్‌బి’లో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేంజ్, కంప్యూటర్ ఎబిలిటీస్, జనరల్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, చరిత్ర (తెలంగాణ సంస్కృతి)తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ప్రతీ ప్రశ్నకు ఒకటి చొప్పున 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇందులో సెక్షన్‌ఎ లో 80 మార్కులు, కోర్ సబ్జెక్ట్, సెక్షన్‌బిలో జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని కోరిన అధికారులు జెఏఓ పోస్టులకు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 11 వరకు స్వీకరిస్తారు. పరీక్ష సెప్టెంబర్ 30న నిర్వహిస్తారు. జెపిఓ పోస్టుల దరఖాస్తులు సెప్టెంబరు 11 నుంచి స్వీకరిస్తారు. చివరి తేది అక్టోబరు 25. పరీక్ష తేదీ అక్టోబరు 14. ఇతర వివరాలకై అభ్యర్థులు టిఎస్ ట్రాన్స్‌కో వెబ్‌సైట్.డబ్లుడబ్లుడబ్లు.టిఎస్‌ట్రాన్స్‌కో.ఇన్ సందర్శించాలని కోరారు.

Comments

comments