Home తాజా వార్తలు 18 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..

18 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..

appsc

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. డిఎస్సితో పాటు 18 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించిందని ఎపిపిఎస్సి ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ తెలిపారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన ఇస్రో అంతరిక్ష వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఉదయభాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రయోగ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎపిపిఎస్సి ద్వారా 5 నుండి 6వేల ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు తెలిపారు. అక్టోబర్ నుండి డిసెంబర్ చివరి లోపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలవుతుందని స్పష్టం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల కోసం మారిన సిలబస్‌ను 4, 5 రోజుల్లో ఎపిపిఎస్సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని  ఆయన వెల్లడించారు.

Notification for 18,000 jobs in AP

Telangana News