హైదరాబాద్: తెలంగాణలోని వివిధ గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. శనివారం నియామక మండలి (టిఆర్ఇఐఆర్బి) ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీల్లో మొత్తం 2,932 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 960 టిజిటి పోస్టులు, 1972 పిజిటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జులై 9వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.