Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పది రోజుల్లో పోలీసు, ఫైర్ సర్వీస్, ఎస్‌పిఎఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

police-recruitmentతెలంగాణ కోణంలో సిలబస్
నూతన అంశాలు, మార్గదర్శకాలకు తుది మెరుగులు
రాత పరీక్షల్లో తెలంగాణ చరిత్రకు పెద్దపీట

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పోలీసు, అగ్నిమాపక, ఎస్‌పిఎఫ్ విభాగాల ఖాళీల భర్తీలకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ మూడు విభాగాల్లో తొమ్మిది వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసేందుకు సర్కా రు పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించిన నూతన సిలబస్ పాటు కొత్త మార్గదర్శకాలను బోర్డు అధికారులు రూపొందించడంలో బిజీగా వున్నారు. ఈసారి భర్తీలో తెలంగాణ చరిత్రకు పెద్ద పీట వేయాలని బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ముగింపుదశకు చేరడంతో వారం పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఇంతకు ముందు ఉమ్మడి ఎపిలో భాగంగా ఈ మూడు విభాగాల ఖాళీలు భర్తీ కావడం తెలిసిందే. అప్పట్లో భర్తీ విధానం భిన్నంగా వుండడం తెలిసిందే. ముందుగా ఐదు డకిలోమీటర్ల పరుగు పందెం, ఇందులో గెలుపొందిన అభ్యర్థులకు ఆనక దేహదారుఢ్య పరీక్షలు, వీటిలో ఉత్తీ ర్ణులైన వారికి క్రీడాంశాల్లో పోటీలు, ఇందులో కూడా గెలుపొందిన వారికి చివరగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేయడం తెలిసిందే.

అయితే తెలంగాణలో జరగబోయే పోలీసు, అగ్నిమాపక, ఎస్‌పిఎఫ్ భర్తీలో ఐదు కిలోమీటర్ల పరుగు పందాన్ని సర్కారు రద్దు చేసింది. ఇది నిరుద్యోగులకు పెద్ద ఊరటగా చెప్పాలి. దీంతో పాటు దేహదారుఢ్య పరీక్షలు గతంలో మాదిరిగా కాకుండా కొత్త పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇంతకు ముందు ఉన్నట్లుగా పురుషులకు ఐదు క్రీడాంశాల్లో మూడింట్లో, మహిళలకు మూడు అంశాల్లో రెండింట్లో గెలుపొందితే సరిపోయేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక రాత పరీక్షల వరకు వచ్చేసరికి ఈసారి ఉమ్మడి ఎపి లో వున్నట్లుగా కాకుండా పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణ యించింది. ఎస్‌ఐ తత్సమాన పోస్టులకు తెలంగాణతో పాటు భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు, అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్, గణితం, కొంతమేర సైన్స్‌కు సంబంధించిన అంశాలు రాత పరీ క్షలో చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇదివరక టిలా ఎపికి సంబంధించిన అంశాలను ప్రశ్నాపత్రాలలో దూరంగా వుంచే వీలుంది. కేవలం తెలంగాణ చరిత్ర, ఇక్కడి భౌగోళిక అంశాలు, భారతదేశంలో తెలంగాణ పాత్ర, ఇక్కడి సామాజిక పరిస్థితులు, జీవన విధానం, ప్రజల జీవన పరిస్థితుల గురించి ఎక్కువగా ఉండే వీలుం దని తెలుస్తోంది.

ఇక కానిస్టేబుళ్లు తత్సమాన పరీక్షల్లో కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశాలే వుండే అవకాశాలున్నాయి. దీనిపై రిక్రూట్‌మెంట్ బోర్డుకు సర్కారు ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిసింది. ఎస్‌ఐతో పా టు కానిస్టేబుళ్లు తత్సమాన పోస్టుల భర్తీ ఏ ప్రాతిపది కన నిర్వహించాలనే దానిపై పక్కాగా వ్యవహరించాలని, ఎ క్కడా న్యాయపరమైన అంశాలకు తావులేకుండా చూడా లని సర్కారు ఆదేశించినట్లు తెలిసింది. భర్తీల్లో స్థానికాం శం విషయంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనలనే పాటిం చాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈసారి జరిగే భర్తీల్లో వయో పరిమితితో పాటు అనేక అంశాలలో సడలింపుల దృష్టా వేల సంఖ్యలో నిరుద్యోగులు దర ఖాస్తు చేసుకునే అవకాశం వుండడం, ఇదే సమయంలో తుది అంకానికి వచ్చేసరికి 1ః10నుంచి 1ః15 వరకు పోటీ వుండే వీలుందని, దీనికి అనుగుణంగా ప్రశ్నావళిని సిద్ధం చేయాలని బోర్డును సర్కారు కోరినట్లు తెలిసింది. రాత పరీక్షల తుది ఫలితాల విడుదలపై కంప్యూటర్లలో పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడాలని ఆదేశించిందని తెలిసింది. సర్కారు ఆదేశాలపై బోర్టు అధికారులు అన్ని అంశాలపై తుది కసరత్తులు చేబట్టారు.

Comments

comments