Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కొల్లలుగా పోలీసు కొలువులు 18,428

polish

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

17156 కానిస్టేబుల్, 1272 ఎస్‌ఐ పోస్టులు
www.tslprb.in వెబ్‌సైట్ ఆన్‌లైన్ ద్వారా..
ఈనెల 9 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో 18,428 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీ సు రిక్రూట్‌మెంట్ బోర్టు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో కానిస్టేబుల్స్ 16,767, ఫైర్‌మెన్ 168, వార్డెన్స్ 221, సబ్ ఇన్‌స్పెక్టర్స్ 739, ఎఎస్‌ఐ 26, ఆర్‌ఎస్‌ఐ 471, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 19, డిప్యూటీ జైలర్లు 15, అసిస్టెంట్ మ్యాట్రన్ 02 పోస్టులున్నాయి. ఈ నెల 9 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (www.tslprb.in) దరఖాస్తులు స్వీకరించనున్నారు. గత కొంతకాలంగా పోలీసు నియామక సంస్థ ఈ నియామకాలకు సంబంధించి కసరత్తు చేసింది. అన్ని అనుమతులు పొందాక గురువారం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులకు ఈ ప్రకటనలు జారీ చేసింది. మొత్తం 18428 ఉద్యోగాలకు సంబంధించి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రధానంగా కానిస్టేబుళ్లను అధిక సంఖ్యలో నియమించాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగానికి ఇంటర్మీడియెట్ ప్రధాన అర్హతగా పేర్కొన్నారు. గరిష్ఠంగా వయో పరిమితి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ కొన్ని పోస్టులకు మాత్రమే ఇచ్చారు. హోంగార్డులుగా ఒక ఏడాది పనిచేసిన వారికి ఈ సడలింపు ఇచ్చారు. దరఖాస్తులు స్వీకరించాక వివిధ పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని పోలీసు నయామక సంస్థ భావిస్తోంది.

కానిస్టేబుల్ పోస్టుల వివరాలు…

సివిల్ కానిస్టేబుల్ పురుషులు, మహిళలు 5909
ఎఆర్ కానిస్టేబుల్ పురుషులు, మహిళలు 5273
ఎస్‌ఎఆర్ సిపిల్ కానిస్టేబుల్ పురుషులు 53
టిఎస్‌ఎస్‌పి కానిస్టబుల్ పురుషులు 4816
టిఎస్‌పిఎఫ్ కానిస్టేబుల్ 485
ఫైర్ మెన్ 168
జైళ్ల శాఖ పురుషు వార్డెన్స్ 186
జైళ్ల శాఖ మహిళ వార్డర్స్ 35

ఎస్‌ఐ పోస్టుల వివరాలు…

సివిల్ ఎస్‌ఐ (పురుషులు, మహిళలు) 710
ఎఆర్ ఎస్‌ఐ (పురుషులు, మహిళలు) 275
ఎస్‌ఎఆర్ సిపిఎల్ ఎస్‌ఐ పురుషులు 05
టిఎస్‌ఎస్‌పి 15వ బెటాలియన్ ఎస్‌ఐ (పురుషులు) 175
టిఎస్‌ఎస్‌పి 15 బెటాలియన్ ఎస్‌ఐ పురుషులు 16
అగ్నిమాపక శాఖ ఎస్‌ఐ 19
జైళ్ల శాఖ ఎస్‌ఐ 15
అసిస్టన్ట్ మట్రోన్ ఇన్ ప్రిజన్స్ 2

ఐటి కానిస్టేబుల్ పోస్టులు

కమ్యూనికేషన్ కానిస్టేబుల్ (పురుషులు, మహిళలు) 142
పిటిఒ మెకానిక్ కానిస్టేబుల్ (పురుషులు) 19
పిటిఒ డ్రైవర్లు (పురుషులు) 70

ఐటి ఎస్‌ఐ పోస్టులు

కమ్యూనికేషన్ ఎస్‌ఐ (పురుషులు, మహిళలు)29
ఫింగర్ ప్రింట్ బూయరో ఎస్‌ఐ (పురుషులు, మహిళలు)26

Comments

comments