Home తాజా వార్తలు కెటిఆర్‌తో నోవార్టీస్ సిఇఒ భేటీ

కెటిఆర్‌తో నోవార్టీస్ సిఇఒ భేటీ

Novartis CEO Meets Minister KTR

హైదరాబాద్ : తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌తో నోవార్టీస్ సంస్థ సిఇఒ వాస్ నరసింహన్‌ భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఎంతో అనుకూలమైనదని కెటిఆర వాస్‌నరసింహన్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో జీవ వైవిధ్య రంగానికి సంబంధించిన పరిస్థితులపై కెటిఆర్ ఆయనకు వివరించారు. జీవ వైవిధ్య ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఆసియాలోనే అతిపెద్దదైన జీనోమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టినట్టు కెటిఆర్ వెల్లడించారు. జీవ వైవిధ్య రంగానికి తోడ్పాటును అందించాలని కెటిఆర్ కోరగా, అందుకు వాస్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు.

Novartis CEO Meets Minister KTR