Home బిజినెస్ ఒక్క రోజులోనే పాన్, టాన్

ఒక్క రోజులోనే పాన్, టాన్

  • మార్చి 31వరకు 19,704 కొత్త కంపెనీలకు కార్డులు
  • ఇ-పాన్‌ను ప్రవేశపెట్టిన సిబిడిటి

pan-card

న్యూఢిల్లీ : పాన్(శాశ్వత ఖాతా నంబర్), టాన్(పన్ను మినహాయింపు ఖాతా నంబర్) కార్డులను మరింత వేగ వంతంగా జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త కార్పొరేట్లకు సులభతర వ్యాపారం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మెరుగుపర్చే ప్రక్రియలో భాగంగా కేవలం ఒక్క రోజులోనే పాన్, టాన్ కార్డులను ఇచ్చేందు కు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలతో సిబిడి టి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఒప్పందం కుదుర్చుకుం ది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పోర్టల్‌పై దరఖాస్తు ఫామ్(ఐఎన్‌సి 32) కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది.. ఈ వివరాలను మంత్రిత్వశాఖ సిబిడిటికి పం పి, ఆ తర్వాత పాన్, టాన్ కార్డును జారీ చేస్తారని మంత్రి త్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విధంగా మార్చి 31వరకు 19,704 కొత్త కంపెనీలకు పాన్‌ను కేటాయిం చినట్లు పేర్కొంది. 2017 మార్చిలో 10,894 కొత్త కంపె నీలకు పాన్ కార్డులను 95.63 శాతం 4 గంటల్లోనే కేటా యించగా, మిగతా కేసుల్లో ఒక రోజు సమయం పట్టిందని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదే విధంగా 94.7 శాతం కేసుల్లో 4 గంటల్లోనే టాన్‌లను కేటాయించామని, మిగ తా వాటికి ఒక రోజు సమయం తీసుకుందని వెల్లడించిం ది. మరోవైపు సిబిడిటి ఎలక్ట్రానిక్ పాన్ కార్డు(ఇ-పాన్)ను ప్రవేశపెట్టగా.. దీనిని ఇ-మెయిల్ ద్వారా పంపుతారు. భౌతికంగా పాన్ కార్డు జారీకి కొంత సమయం తీసుకుం టారు. ఇ-పాన్‌కు డిజిటల్ సంతకంతో కూడిన కార్డు.. దీనిని గుర్తింపుగా చూపవచ్చు. మరోవైపు ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోగా పాన్ కార్డుకు ఆధార్ కార్డును అను సంధానం చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. చేయకపోయినట్లయితే వచ్చే సంవత్సరం జన వరి ఒకటో తేదీ తర్వాత పాత పాన్ కార్డు ఎందుకూ పనికిరాదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలే వెల్లడించాయి. ప్రస్తుతం ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. అక్రమాలన్నింటికీ చెక్ పెట్టేందుకు పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 108 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. అందువల్ల ప్రభుత్వ పథకాలకు దీన్ని అనుసంధానం చేస్తోంది. దేశంలో 25 కోట్ల పాన్ కార్డులున్నాయి. 50 వేలకు మించిన నగదు లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డు నెంబరును రాయడం తప్పనిసరి. అలాగే 2 లక్షల రూపాయలకు మించి బంగారం కొన్నా పాన్ నెంబరును రాయాల్సిందే. ఇక కొత్తగా వస్తున్న కార్డులకు కూడా ఆధార్ అనుసంధానం ఉంటుంది. దీని వల్ల మోసాలకు తావుండదని ప్రభుత్వం భావిస్తోంది.
అదే సమయంలో ఆదాయ పన్ను శాఖ ఇటీవల ఖాతాదారుల నుంచి పాన్ వివరాలను సేకరించాలని బ్యాంకులను ఆదేశించింది. దీనికి గాను మూడు నెలల గడువు అంటే జూన్ 30లోగా అందరు ఖాతాదారుల పాన్ కార్డు వివరాలను ఇవ్వాలని సూచించింది. దీని ద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేయాలని ఐటి శాఖ భావిస్తోంది. పాన్ వివరాలను సేకరించాలని బ్యాంకులకు గతంలో ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. అయితే మరోసారి గడువును పొడిగించింది. ఐటి నిబంధన 114బిలో పలు లావాదేవీలతో పాటు పాన్ కార్డు తప్పనిసరి అని చెప్పింది. గత ఏడాది నవంబర్ 9న డిమానిటైజేషన్ ప్రకటన తర్వాత బ్యాంకుల్లో నమోదైన లావాదేవీల వివరాలు అన్నింటిని అందజేయాలని ఐటి బ్యాంక్‌లను ఆదేశించింది. 2016 నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో సేవింగ్ అకౌంట్లలోకి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్లు, అలాగే కరెంట్ ఖాతాల్లోకి రూ.12.50 లక్షలకు పైబడి డిపాజిట్లు వచ్చిన వివరాలను అందజేయాలని ఐటి బ్యాంకులను ఆదేశించింది. ఒక్క రోజులో నగదు డిపాజిట్లు రూ.50 వేలకు మించితే వాటి వివరాలను కూడా ఇవ్వాలని కోరింది. నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు 15 లక్షల కోట్ల పాత నోట్లు వెనక్కి వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఐటి విభాగం బ్యాంకుల డిపాజిట్లపై దృష్టిపెట్టి అన్ని నివేదికలను పరిశీలిస్తోంది.