Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐల ప్రచారం

టిఆర్‌ఎస్ గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐల ప్రచారం

NRIs Election Campaign for TRS

హైదరాబాద్ : డిసెంబరు 7న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు ప్రచారం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ ఆస్ట్రేలియా శాఖ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఆస్ట్రేలియా విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వరంలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్ధతుగా తాము ప్రచారం చేస్తామని సాయిరాం ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రచారంలో టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల తదితరులు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం చేస్తున్నట్టు నాగేందర్‌రెడ్డి వెల్లడించారు.

NRIs Election Campaign for TRS