Search
Monday 24 September 2018
  • :
  • :

ఢిల్లీ వర్శిటీ ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యుఐ విజయం

                      NSUI

న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘం (డియుఎస్‌యు) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) విజయకేతనం ఎగురవేసింది. బుధవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్ల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. డియుఎస్‌యులో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి)కి ప్రాబల్యం ఉన్నప్పటకీ కూడా కేవలం సంయుక్త కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి పదవులను మాత్రమే గెలుచుకుంది.

అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఎన్‌ఎస్‌యుఐ అభ్యర్థి రాఖీ తుషీద్ 1, 590 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, కునాల్ సెర్వాట్ ఎబివిపి అభ్యర్థిని 175 ఓట్ల తేడాతో ఓడించారు. ఎబివిపి మహమేధా నగర్ 2, 624 ఓట్లు తేడాతో ఎన్‌ఎస్‌యుఐ మీనాక్షి మీనాను ఓడించి ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. మరోవైపు సంయుక్త కార్యదర్శి అభ్యర్థి ఉమా శంకర్ 342 ఓట్ల తేడాతో ఎన్‌ఎస్‌యుఐ అభ్యర్థి అవినాష్ యాదవ్‌ను ఓడించారు. మంగళవారం జరిగిన డియుఎస్‌యు ఎన్నికల్లో మొత్తంగా 43 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది డియుఎస్‌యు ఎన్నికల్లో ఎబివిపి మూడు పదవులను దక్కించుకోగా, ఎన్‌ఎస్‌యుఐ మాత్రం ఒక సంయుక్త కార్యదర్శి పదవిని మాత్రమే దక్కించుకుంది.

Comments

comments