Home తాజా వార్తలు జమునకు ఎన్‌టిఆర్‌,ఎఎన్‌ఆర్ జీవిత సాఫల్య పురస్కారం

జమునకు ఎన్‌టిఆర్‌,ఎఎన్‌ఆర్ జీవిత సాఫల్య పురస్కారం

NTR And ANR life achievement award for Jamuna

కాచిగూడ : వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రజానటి, లోక్‌సభ పూర్వ సభ్యురాలు డాక్టర్ జమున రమణారావుకు ఎన్‌టిఆర్–ఎఎన్‌ఆర్-వంశీ జీవిత సాఫల్య పురస్కారం, వెండి కిరీట బహూకరణ మహోత్సవం ఈ నెల 22న చిక్కడపల్లి, శ్రీ త్యాగరాయగానసభలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత డా. వంశీ రామరాజు శుక్రవారం ఓక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటరత్న ఎన్‌టిఆర్, నటసమ్రాట్ ఎఎన్‌ఆర్ జ్ఞాపకార్థంగా నెలకొల్పిన పురస్కారాలను జమునతో పాటు వంశీ కల్చరల్ అండ్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కె.వి రమణారావుకు ఎన్‌టిఆర్ సేవా పురస్కారం, వి ఐహెచ్‌ఇ డిప్యూటి డైరెక్టర్ ఎ.ఎస్ మూర్తికు ఎఎన్‌ఆర్ సేవా పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ డా. కె. రో శయ్య హాజరవగా, ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సభాధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి స భ్యులు రుద్రరాజు పద్మరా జు, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ సినీనటీ గీతాంజలి, రోజా రమణిలు తదితరులు పాల్గొంటారన్నారు.

NTR And ANR life achievement award for Jamuna