Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మార్చిలో ఎన్‌టిఆర్ బయోపిక్

NBK

హైదరాబాద్ : టిడిపి వ్యవస్థాపకుడు, తన తండ్రి ఎన్‌టిఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందించనున్న బయోపిక్‌ను మార్చిలో ప్రారంభిస్తామని నటుడు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ చిత్రం తేజా దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌టిఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నారు. గురువారం ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్‌టిఆర్ బాల్యం నుంచి మహానటుడిగా, సిఎంగా ఎదిగిన క్రమం ఈ చిత్రంలో ఉంటాయని ఆయన చెప్పారు. ఎన్‌టిఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎన్‌టిఆర్‌కు భారత రత్న కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు.

ఇదిలా ఉండగా ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమరావతిలో ఎన్‌టిఆర్‌కు నివాళులు అర్పించారు.

NTR Biopic in March :  Hero Balakrishna

Comments

comments