Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎన్టీఆర్-బాబీల చిత్రం ‘లవకుశ’?

ntrకొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ అంటూ… ‘నట విశ్వరూపం’ అనే పేరు హల్‌చల్ చేసింది. దీనిపై అభిమానుల నుంచి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అదే సమ యంలో ఈ చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్.. సినిమాకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ ఏవీ నమ్మవద్దని చెప్పడంతో ఈ టైటిల్ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అదే… ‘జై లవకుశ’.  నందమూరి తారకరామారావు ఆర్ట్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్  ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయిం చాడు. ఇది ఎన్టీఆర్ సినిమా కోసం రిజిస్టర్ చేయించిన టైటిలే అని అంటున్నారు. బాబీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రా భినయం చేస్తాడని టాక్ వినిపిస్తోంది. సినిమాలో మూడు పాత్రల పేర్లు  జై, లవ, కుశ… అని అందుకే ఈ టైటిల్ రిజిస్టర్ చేయిం చారని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఒకప్పటి క్లాసిక్ మూవీ ‘లవకుశ’ టైటిల్ ఈ సినిమాకు సెంటిమెంటుగా కూడా పనికొ స్తుందని అంటున్నారు. అయితే ఈ విష యంలో అధికారికంగా ప్రకటన వస్తే మాత్రం ఈ టైటిల్ పక్కా అని చెప్పలేం.

Comments

comments