Home సినిమా అన్నకు ప్రేమతో…

అన్నకు ప్రేమతో…

NTR Celebrates Brother Kalyanram Birthday

హైదరాబాద్: అన్న కల్యాణ్ రామ్ బర్త్ డేను తమ్ముడు జూనియర్ ఎన్‌టిఆర్‌ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అన్నయ్యతో కేక్ కట్ చేయించి, అప్యాయంగా కేక్ తినిపించాడు. ఈ కార్యక్రమంలో తారక్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక  మే20న తారక్ తన 35వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కల్యాణ్ రామ్ కోటి రూపాయల విలువైన రిచర్డ్ మిల్ అనే స్విస్ కంపెనీ చేతి గడియారాన్ని గిఫ్ట్ గా ఇచ్చి తమ్ముడిపై ప్రేమను చాటుకున్నాడు అన్న. ఇలా ఈ అన్నదమ్ముల అనుబంధం రోజు రోజుకు బలపడుతున్నది. ఈ అన్నదమ్ముల ప్రేమానురాగాలను చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.

Kalyanram-with-Jr.NTR

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత మూవీతో బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రానున్న మల్టీస్టారర్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి నంటించనున్నాడు. కల్యాణ్ రామ్ కూడా తన 16వ మూవీ ఏర్పాట్లలో ఉన్నాడు.