Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎన్‌టిఆర్ చరిత్ర సృష్టించి.. నిలిచిపోయారు..

Venkaiah-Naidu

హైదరాబాద్: తెలుగు భాషలో, సినీ, రాజకీయ రంగంలో ఎన్‌టిఆర్ చరిత్ర సృష్టించారని, చరిత్రలో నిలిచిపోయారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు.  నాచారంలోని రామకృష్ణ హార్టికల్చరల్‌ సినీ స్టూడియోలో రామారావు జీవిత చరిత్ర ఆధారంగా “ఎన్‌టిఆర్” సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి   ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….  దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  చరిత్రను అందరికీ తెలియాజేయాల్సిన అవసరముందన్నారు. ఎన్‌టిఆర్ కు నిజమైన నివాళి అంటే ఏంటంటే.. తెలుగులో మాట్లాడలి, తెలుగును ప్రోత్సహించాలి, తెలుగువాడైనందుకు గర్వంగా ఉండాలన్నారు. రాముడు, కృష్ణుడు అంటే మనకు ఎన్‌టిఆరే గుర్తుకొస్తారని చెప్పారు. తనకు రామారావుగారంటే చాలా అభిమానమని గుర్తు చేశారు. రామారావు వేషధారణలోగాని, వస్త్రధారణలోగాని, పలుకులోగాని, చిరునవ్వులోగాని ఆయనకు ఆయనే సాటి ప్రశంసించారు.

ఎన్‌టిఆర్‌కు అభిమాని కానివారు సినిమా రంగంలో లేరన్నారు. బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిని మెచ్చుకున్నారు. ఎన్‌టిఆర్ బయోపిక్ లాంటి సినిమాలు రూపొందాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఎన్‌టిఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నారు. తేజ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ బయోపిక్ తెరకెక్కుతున్నది. ఈ కార్యక్రమానికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Comments

comments