Search
Friday 21 September 2018
  • :
  • :

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్‌టిఆర్

NTR--10

మన తెలంగాణ/పాపన్నపేట : మండల కేంద్రం లోని పాత బస్టాండ్ వద్ద ఎన్‌టిఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి మండల టిడిపి పార్టీ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ నర్సింలుగౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేసారు. పాపన్నపేట మండల టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కుర్తివాడ సత్యాగౌడ్, అరెపల్లి శివాజి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంగారెడ్డి అర్బన్‌లో… తెలుగుజాతి కోసం నంద మూరి తారక రామారావు చేసిన కృషి ఎనలేనిదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ 21వ వర్థంతి సంద ర్భంగా సంగారెడ్డి చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంగారెడ్డి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బందెన్న గౌడ్, నర్సింలు, మాణయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
హత్నూరలో… పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఎన్‌టి రామరావు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఎంఏ హకీం అన్నారు. బుధవారం మండలంలోని దౌల్తా బాద్‌లోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎన్‌టిఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. టిడిపి మండల అధ్యక్షులు ఆర్జున్, ప్రధాన కార్యదర్శి సదా నందం, విఠల్, లక్ష్మన్, రమేష్ పాల్గొన్నారు.
శివ్వంపేటలో…. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశ పార్టీ వ్యవస్థాపకులు సర్గీయ నందమూరి తారకరామారావు 21వ వర్ధింతిని పుర స్కరించుకుని శివ్వంపేట మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పిల్లుట్ల, గోమారం గ్రామాలలో తెలుగుదేశం శ్రేణులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. శివ్వం పేటలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి మాజీ సర్పం చ్ క్రిష్ణా గౌడ్, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు జంగ నగేష్ ఘనంగా నివాళులు అర్పించారు. శివ్వంపేట గ్రామ టిడిపి కమిటీ అధ్యక్షులు సత్యనారాయణగౌడ్, మం డల బిసీ సెల్ అధ్యక్షులు బిజిలిపురం క్రిష్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరుడి నర్సింహులు, మండల తెలుగు యువత అధ్యక్షులు నారాయణగారి వినోద్, రైతు సంఘం అధ్యక్షులు దొడ్ల రాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం పారిశ్రామికవాడలో… టిడిపి వ్యవస్థాపకు డు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం గుమ్మడిదల, జిన్నారం పారిశ్రామికవాడలో ఘనంగా జరుపుకున్నారు. పారి శ్రామికవాడలోని గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహలకు పూలమాల వేసి నివాళ్లులర్పించారు. మండల పార్టీ అధ్యక్షులు అశోక్, గ్రామ కమిటి అధ్యక్షులు రాము లుగౌడ్, జైపాల్‌రెడ్డి, నారాయణస్వామి, సత్యనారా యణ, మండల తెలుగు యువత అధ్యక్షులు శ్రావన్ కుమార్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాము, నర్సింలు, రవిందర్ రెడ్డి, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్, గోపాల్, రాం రెడ్డి, ననుబాల వినోద్, అంజనేయులు పాల్గొన్నారు.
జిన్నారంలో… తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని మండలంలోని తెలుగుదేశం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల నాయకులు శ్రీకాంత్, నర్సింలు పాల్గొన్నారు.
మంగంపేటలో… మంగంపేట గ్రామంలో తెలుగు యువత నాయకులు ఎన్‌టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్ధానిక తెలుగు యువత నాయకులు ఎన్‌టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు.
గుమ్మడిదలలో… మండలంలోని పలు గ్రామాలలొ దివంగత మాజీ సిఎం నందమూరి తారక రామా రావు 21వ వర్దంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. గుమ్మడిదల, అనంతరం, మంబాపూర్, బొంతపల్లి, తదితర ప్రాంతాలలోని ఆయన విగ్రహా నికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. జిల్లా టిడిపి కార్యదర్శి జైపాల్ రెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు నాయకులు మద్దుల బాల రెడ్డి, జిల్లా బీసీ కార్యదర్శి మల్లేష్, లకా్ష్మరెడ్డి, మండల యూత్ నాయకులు శ్రావన్ రెడ్డి, రవిందర రెడ్డి, బాల్ రెడ్డి, సత్యనారాయణ, మదు రెడ్డి, చందు, నారాయణ స్వామి, శ్రీశైలం పాల్గొన్నారు.
దుబ్బాకలో… స్వర్గీయ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారకరామారావు ఆశయ సాదన కోసం తెలుగు దేశం పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువస్తామని తెదేపా నియోజక వర్గ ఇంచార్జి ఇల్లెందలు రమేష్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రోజున దుబ్బాక మండల కేంద్రంలో ఆ పార్టి ఆధ్వర్యంలో ఎన్టిఆర్ వర్దంతి కార్యక్రమాన్ని స్దానిక బస్టాండ్ వద్ద నిర్వహించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గడీల సనార్దన్‌రెడ్డి ,మండల ఇంచా ర్జి అనంతుల రాజు, నగర పంచాయతి జనరల్ సెక్రటరీ రాపెల్లి లక్ష్మన్ ,మిరుదొడ్డి మండల అధ్య క్షుడు జహంగీర్ ,కొట్టె నర్సింలు ,కాళిదాస్ ,భాస్కర్ , భూంపల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌లో…. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్య క్షుడు, దివంగత మాజీ సిఎం ఎన్టీఆర్ వర్ధంతి కార్య క్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టిడిపి నాయకులు విరాసత్ అలి, శరీఫ్, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్‌లో… టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్దంతిని రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు నివాళులర్పిస్తే సదాశివ పేట పట్టణంతో పాటు మండలంలోని ఎ ఒక్క గ్రామాల్లో కూడ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ వర్దంతిని మరిచి పోవడంతో టిడిపి పార్టీ ఉందా లేదా అనుమానం కలుగుతోందని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండాపూర్‌లో… కొండాపూర్ మండలంలో టిడిపి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కొండాపూర్‌లో ఎన్టీ ఆర్ వర్దంతిని జరపకపోవడంపై ఎన్టీఆర్ అభిమా నులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక ర్తలు, అభిమానులతో నిత్యం పార్టీకి క్యాడర్ ఉండి కార్యక్రమాలు నిర్వహించేది. కార్యకర్తలు, నాయ కులు ఇప్పటికీ చాలా గ్రామాలో సీనియర్ నాయ కులు ఉన్నప్పటికీ వారిని పార్టీ హై కమాండ్ నేతలు పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం కార్యక్ర మాలు నిర్వహించాలని చెప్పకపోవడంతో కార్యకర్త లు, నాయకులను పార్టీకి అధిష్ఠానమే దూరం చేస్తుందేమోనన్న పరిస్థితి నెలకొందని కొంత మంది టిడిపి నాయకులు పేర్కొన్నారు.

Comments

comments