Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నందమూరి వారసుడి చిత్రం?

trivikramస్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పుడూ ఆ ముగ్గురు హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, అల్లుఅర్జున్… వీరితోనే సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకుంటాడు. కానీ ఇటీవల నితిన్‌తో ‘అ..ఆ’ సినిమా చేసి టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఇక త్రివిక్రమ్ చేతుల మీదుగా తమ వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి  ప్రయత్నాలు జోరుగా జరిగాయి… జరుగుతున్నాయి. గతంలో అక్కినేని అఖిల్ మొదటి సినిమాకు త్రివిక్రమ్ పేరు వినిపించింది. కానీ అది కుదరలేదు. ఇప్పుడు అతని రెండో సినిమాకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు గట్టిగానే వినిపించినా అదే కురదలేదు. అదే సమయంలో  నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అరంగేట్రం చేసే సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో తీయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడు త్రివిక్రమ్. సహజంగా ఇందుకోసం రెండు, మూడు నెలల సమయం తీసుకుంటాడు. డిసెంబర్ నుండి పవన్‌తో సినిమా ప్రారంభించాల్సి ఉండగా… ఇప్పుడు మోక్షజ్ఞతో సినిమా అంటే సాధ్యమా అన్నది చూడాల్సిందే. పవన్ సినిమా తర్వాతే మోక్షజ్ఞతో సినిమా ఉండవచ్చని అంటున్నారు.

Comments

comments