Home తాజా వార్తలు ఎన్‌టిఆర్ మరణానికి బాబే కారణం: మోత్కుపల్లి

ఎన్‌టిఆర్ మరణానికి బాబే కారణం: మోత్కుపల్లి

Mothkupalli-narashimlu

హైదరాబాద్: నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావుకి టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించిన అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టిఆర్ మరణానికి ఎపి సిఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపణలు చేశారు. బాబు కుట్రలకు ఎన్‌టిఆర్ బలయ్యారని, ఎన్‌టిఆర్ దగ్గర టిడిపి జెండాను చంద్రబాబు దొంగతనం చేశారని ధ్వజమెత్తారు. కాపులు, బిసిల మధ్య చంద్రబాబు గొడవ పెడుతున్నారని, ఇప్పుడు బ్రాహ్మణులనూ వదలడం లేదని మండిపడ్డారు. ఎన్‌టిఆర్ దయ వల్లే నాలాంటి పేదవారు పార్టీలో ఉన్నారని మోత్కుపల్లి స్పష్టం చేశారు.