Home తాజా వార్తలు ఎన్టిఆర్ కు ఘనంగా నివాళులర్పించిన కుటుంబ సభ్యులు

ఎన్టిఆర్ కు ఘనంగా నివాళులర్పించిన కుటుంబ సభ్యులు

ntr

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు, దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ సమీపంలో  ఎన్టిఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టిఆర్‌, కల్యాణ్‌రామ్‌, కుటుంబ సభ్యులు, తదితరులు ఆయనకు పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్బంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎన్టిఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని. ఎన్టిఆర్ జీవిత విశేషాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.

NTR Family Members Tribute to NTR Birth Anniversary