Home తాజా వార్తలు శ్రీవారిని దర్శించుకున్న ’ఎన్‌టిఆర్‌‘ చిత్ర బృందం

శ్రీవారిని దర్శించుకున్న ’ఎన్‌టిఆర్‌‘ చిత్ర బృందం

'NTR' Film Unit Visits Tirumalaతిరుమల : తిరుమల శ్రీవారిని ‘ఎన్‌టిఆర్‌ కథానాయకుడు’ సినిమా యూనిట్ మంగళవారం ఉదయం దర్శించుకుంది.  బాలకృష్ణ, విద్యాబాలన్‌, సుమంత్‌, సాయి కొర్రపాటి తదితరులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న సినిమా యూనిట్ కు  టిటిడి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ‘ఎన్‌టిఆర్‌ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదల  కానుంది. ఈ క్రమంలోనే శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని హీరో బాలకృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్టు ఆయన వెల్లడించారు.

‘NTR’ Film Unit Visits Tirumala