Home బిజినెస్ ‘సెలెక్ట్’ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జూ. ఎన్టీఆర్‌

‘సెలెక్ట్’ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జూ. ఎన్టీఆర్‌

Jr. NTR is the brand ambassador for Select Mobile

మనతెలంగాణ/మియాపూర్ : ‘సెలెక్ట్’ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించారు. శుక్రవారం మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్‌లో సెలక్ట్ మొబై ల్స్ లోగోను జూ. ఎన్టీఆర్, సెలక్ట్ ఎండీ గురు, డైరెక్టర్ మురళీలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ మా ట్లాడుతూ సెలక్ట్ మొబైల్స్ అనేది ఒక కొత్త రకం ట్రెండ్‌ను ముం దుకు తీసుకువస్తుందన్నారు. మొబైల్స్‌లో ఇన్నోవేటివ్, వైబ్రేట్‌లు డిజైన్ చేశారన్నారు. రెండు తెలు గు రాష్ట్రాలలో సుమారు 200 స్టోర్స్‌ను ప్రారంభించనున్నడం ఆనందంగా ఉందన్నారు. ప్యాన్ ఇండియాలో సుమారు 500 స్టొర్స్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. తాను సెలక్ట్ ఫ్యామిలీలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాదానం తెలుపుతూ తను చిన్నతనంలో మొబైల్ ఫోన్ కోసం కోఠిలోని జగదీష్ మార్కెట్‌కు వెళ్ళి కొనుకున్న సందర్బాన్ని గుర్తు చేశారు. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరన్నారు. తాను మొదట వాడిన ఫోన్ ఆల్కాటెల్ అన్నారు. తదనంతరం సెలక్ట్ ఎండి గురు, డైరెక్టర్ మురళీలు మాట్లాడుతడూ తిరుపతి మే 2వ తేదిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశిస్సులతో మూడు స్టోర్లు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ నెల 20వ తేదిన సుమారు 30 సెలక్ట్ స్టోర్లు ప్రారంభించనున్నామన్నారు. మొదటగా 2500 సిబ్బందితో 200 స్టోర్లు, రెండవ విడతగా 7500 మంది సిబ్బందితో 500 స్టోర్లు మొత్తం కలిపి 700 స్టోర్స్‌లో సుమారు 10000 మంది సిబ్బందితో సెలక్ట్ స్టోర్లు ముందుకు వెళ్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యత, సర్వీస్, అనుభవంతో కూడినటువంటి సెలక్ట్ మొబైల్స్ అందిరిని ఆకట్టుకుంటుందన్నారు. సుమారు రూ.800 కోట్ల పెట్టుబడితో 200 సెలక్ట్ స్టోర్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు.