Home తాజా వార్తలు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్‌ వచ్చేసింది

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్‌ వచ్చేసింది

 

హైదరాబాద్‌: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా రూపొందించారు. ‘ఇచ్చిన ప్రతిమాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనపడాలి, ఇన్‌టైమ్‌ ఆన్‌ డోర్‌’…. ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అని బాలయ్య నాయకుడిగా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మహానాయకుడు’లో ఎన్టీఆర్‌ రాజకీయ నాయకుడిగా ప్రజలకు చేసిన సేవ, ఎదుర్కొన్న సవాళ్లను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు క్రియేటీవ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించగా..  ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా రూపొందించగా తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలైంది.

అయితే ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఇప్పుడు అందరి చూపు రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడుపై ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ బయోపిక్‌లో బసవతారకం పాత్రను విద్యా బాలన్‌ పోషించగా… హరికృష్ణగా కల్యాణ్‌రామ్, చంద్రబాబుగా రానా, ఎఎన్నార్‌గా సుమంత్‌ నటించారు. ఎన్బికె ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తోంది. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ చిత్రాన్ని మొదట ఫిబ్రవరి 7న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించారు. కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

 

NTR Mahanayakudu Trailer launch